పాడిపంటలు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని, ఏటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు.
అందుకు నగరంలోని ఈ పండుగలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొననున్నారు.
ఊరపండుగకు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలను కొండెంగా హనుమాన్,అశోక్ విధిలో లోని వడ్లధాతి వద్ద వతాన్‌దార్ల పర్యవేక్షణలో అమ్మవార్లు రూపుదిద్దుకుంతున్నాయి. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊర పండుగను జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకుంటున్నారు.
గ్రామ దేవతలైన సార్గమ్మ (2 విగ్రహాలు), బోగంసాని, కొండలరాయడు, బండి, రాట్నం, ఆసు, పెద్దపులి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, అంపుడు పోచమ్మ ప్రతిమలు ఒకటి చొప్పున ఉంటాయి.
వీటిని సరి గంపలతో ఘనంగా ఊరేగిస్తారు.గ్రామదేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి పండుగను నిర్వహించడం ప్రారంభించారు.