HomeTelanganaNizamabadకేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తున్నారు..ఆర్వోబీ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు.ఆర్వోబీ...

కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తున్నారు..ఆర్వోబీ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు.ఆర్వోబీ నిధుల కోసం త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన..నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్..

ఆర్వోబీ పనుల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారనీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లాలోని నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.

జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నిధులు ఇప్పించకపోవటం సిగ్గుచేటు ఎద్దేవ చేశారు. ఆర్వోబీ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అందుకే పనులు ఆలస్యం అవుతున్నాయనీ తెలిపారు.

ఈ మేరకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిధుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన చేపట్టాలని ఎమ్మెల్యేలు, పార్టి లీడర్లకు పిలుపు నిచ్చారు.అలాగే ఎంపీ ల్యాండ్ నిధులతో చేపట్టిన పనులు కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదనీ తెలిపారు.రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవటం దారుణం అన్నారు. రైతులకు జరిగిన నష్టంపై మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పథకాల్లో స్కాములు చేస్తుందనీ అన్నారు.ఇక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్లు, గర్భిణీ మహిళలకు ఇచ్చే కోడిగుడ్లలో 60 గ్రాములు ఉండాల్సినవి కేవలం 40 గ్రాములకే సైజులను తగ్గించి కోతలు విధిస్తున్నారనీ మండిపడ్డారు.

కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అల్మట్టి పెంచుతామని చెస్తున్న ప్రకటనలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పైర్ అయ్యారు. ఆల్మట్టి ఎత్తు కాదు రేవంత్ నీ ఎత్తు పెంచుకో అంటూ సెటైర్లు వేశారు. అల్మట్టి పెంచుతా మంటున్న ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments