ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కామారెడ్డి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా రహదారులు, పంట పొలాలు దెబ్బ తినడంతో రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి బుధవారం బిక్కనూరు మండలంలోని దాసనమ్మకుంట హరిజనవాడకు వెళ్లే దెబ్బతిన్న దారిని పరిశీలింారు.
అనంతరం అంతంపల్లి గ్రామ శివారులో ఉన్న ఎడ్ల కట్టా వాగును పరిశీలించారు. ప్రవాహానికి నష్టపోయిన చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను కేంద్ర బృంద సభ్యులకు వ్యవసాయ అధికారులు వివరాలు వెల్లడించారు.
జిల్లాలోని వివిధ మండలాలలో కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంట పొలాలు, రహదారుల వివరాు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
