గంజాయి …డ్రగ్స్ లపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతున్న నేపథ్యంలో మత్తు మందు దందా కు తెరలేపారు కొందరు ప్రబుద్ధులు అందుకు డెలివరీ ఏజెన్సీ లను అడ్డం పెట్టుకుంటున్నారు నగరంలో ఇటీవలే ఏర్పాటైన వెల్ నెస్ ఆసుపత్రి లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
డ్రగ్స్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు కానీ పోలీసులు రంగంలోకి దిగారు ఈ దందా వెనుక ఉన్న గుట్టు ను రట్టు చేసే పనిలో ఉన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి వెల్ నెస్ ఆసుపత్రి లో రెండో అంతస్తులో మెడికల్ నుంచి మెలోజోమ్ అనే మెడిసిన్ పార్శిల్ తేవాలంటూ డెలివరీ ఏజెన్సీ ర్యాపిడో కి ఆన్ లైన్ లో ఆర్డర్ బుక్ అయింది.
ఆ మేరకు నవీద్ అనే డెలివరీ బాయ్ నేరుగా వెళ్లి రెండో అంతస్తు లో మెడికల్ లో మెలొజిమ్ మెడిసిన్ తీసుకోని సమీపం దూరంలోనే ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు కానీ వెల్ నెస్ ఆసుపత్రి లో సెక్యూరిటీ కి అనుమానం వచ్చి నవీద్ వద్ద ఉన్న మెడిసిన్ పరిశీలించారు.
ఈ మెడిసిన్ ఎవరిచ్చారు అంటూ గద్దించారు తాను డెలివరీ బాయ్ నని ఆన్ లైన్ ఆర్డర్ వచ్చిందని ఫోన్ చూపించాడు. రెండో అంతస్థులో మెడికల్ లో ఇచ్చారని చెప్పారు. అతన్ని అక్కడే నిర్బంధించారు.
ఈ మందు ఎలా బయటికి వచ్చింది ఆసుపత్రి నిర్వాహుకులు అరా తీశారు. భారీ సర్జరీ లు చేయడానికి రోగులు ఇచ్చే ఈ మత్తు మందు ఇష్టారీతిన చెలామణి చెయ్యడానికి నిబంధనలు అనుమతించవు. ఆసుపత్రి లో జరిగే సర్జరీ ల కోసం యాజమాన్యం పరిమితంగా ఆ మెడిసిన్ అందుబాటులోకి పెట్టుకుంటుంది.
అందులోనూ నిఫుణులైన వారే వినియోగిస్తారు. కానీ ఆసుపత్రి నిర్వహణలోనే ఉండే మెడికల్ స్టోర్ నుంచి ఈ మెడిసిన్ ఎలా బయటికి గుట్టుగా వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తమకు తెల్వకుండా ఈ వ్యవహారం సాగుతుండడం తో ఆసుపత్రి నిర్వాహుకులు ఒకటో టౌన్ పోలీసులకు పిర్యాదు చేసారు.
ఈ మెడిసిన్ ఆన్ లైన్ లో ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఎవరు డెలివరి తీసుకుంటున్నారనేది తదుపరి దర్యాప్తు లో వెల్లడవుతుంది.అయితే గతంలోనూ మూడు డోస్ లు ఇలాగే వెల్ నెస్ ఆసుపత్రి నుంచి గుట్టుగా తరలించారనేది పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడయింది.
