HomeCRIMEఎన్నికల వేళ.. లైసెన్స్ ఆయుధాలు అప్పగించాలి.. పోలీస్ కమిషనర్ వెల్లడి

ఎన్నికల వేళ.. లైసెన్స్ ఆయుధాలు అప్పగించాలి.. పోలీస్ కమిషనర్ వెల్లడి

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపద్యంలో లైసెన్స్ ఆయుధాలు అప్పగించాలనీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గల వారు ఆర్మ్స్ లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని ఆర్మ్స్ లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో ఈ నెల 9 లోపు అప్పగించాలనీ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఎవరయిన లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై ఆర్మ్స్ యాక్టు ప్రకారంగా చట్టరిత్య చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు.

ఎవరైతే అట్టి ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు, నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలోని సంబంధిత అధికారిగారికి వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments