జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంత్రుల ప్రెస్ మీట్ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనూచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషతుగా క్షేమపన చెప్పాలనీ టిఎంఆర్పిఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ డిమాండ్ చేశారు.
లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామలకు బాధ్యత వహించాలనీ తెలిపారు.లేదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఎక్కడికక్కడ అడ్డుకుంటం, ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని మాదిగ జాతి ఓట్లతోనే మంత్రివి అయ్యావని గుర్తు చేస్తున్నామన్నారు.
