నిజామాబాద్ నగరంలోశుక్రవారం రాత్రి గొలుసు దొంగతనం కలకలం రేపింది. బైక్ మీద వచ్చిన ఆగంతకుడు వినాయక్ నగర్ లోని రాజీవ్ విగ్రహం వద్ద కొంత మంది ప్రయాణికులను దించేందుకు ఆటోను నిలిపారు. అక్కడే ఆటోలో ఉన్నా కులస్ పూర్ కు చెందిన మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని బైక్ పై పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు