నిజామాబాద్ నగరంలో ఓ మహిళ మేడలో నుంచి గొలుసు చోరి జరిగిన ఘటన మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.
మాక్లూర్ మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన అర్ల భూలక్షి పని నిమిత్తం నిజామాబాద్ వెళ్ళింది.
తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం నిజామాబాద్ ఆటో స్టాండ్ వద్ద వేచి ఉండగా అప్పటికే ఇద్దరు మహిళలు ఉన్న ఆటో డ్రైవర్ తన ఆటోలో ఏక్కించుకొని వెళ్ళాడు.
కంటేశ్వర్ బైపాస్ నుంచి గౌతమ్ నగర్ వైపుగా వెళ్లి ఆటో లోని ఇద్దరు మహిళలు భూలక్షి మేడలో నుంచి రెండు తులాల పుస్తక తాడు లాక్కొని ఆటో లో నుంచి నెట్టేసి పారిపోయారని తెలిపారు.
భూలక్షిమూడవ టౌన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
