HomeCRIMEగంజాయి ముఠా వేటలో సరిహద్దులు దాటిన ఈగల్ ........దట్టమైన అడవిలో గంటన్నర పాటు ఛేజింగ్

గంజాయి ముఠా వేటలో సరిహద్దులు దాటిన ఈగల్ ……..దట్టమైన అడవిలో గంటన్నర పాటు ఛేజింగ్

గంజాయి ముఠా వేటలో తెలంగాణ ఈగల్ టీం ఏకంగా సరిహద్దులు దాటేసింది ఏకంగా సినిమా స్టైల్ లో దాదాపు గంటన్నర పాటు 80 కిలోమీటర్ల దూరంగా ఛేజ్ చేసింది ఒడిశాలోని బలిమేళా నుంచి జయపూర్ వరకు.. దట్టమైన అడవుల గుండా గంజాయి రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని ఈగల్ ఫోర్స్ వేటాడింది.

చివరకు అటవీ ప్రాంతంలో వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరార్ కాగా.. వాహనాన్ని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది.ఈ తనిఖీల్లో 115 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న సుమారు 500 కిలోల భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి.

ఇందులో 5 కిలోల బరువున్నవి 90 ప్యాకెట్లు .. 2 కిలోల బరువున్నవి మరో 25 ప్యాకెట్లు ఉన్నాయి. పట్టుబడిన గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశాలోని కొరాపుట్ పోలీసులకు అప్పగించారు.

ఈ వాహనం ఒడిశా నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments