చెట్టును ఢీ కొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….
మంచిర్యాల జిల్లా దేవాపూర్ మానడంలోని కాశిపేట గ్రామానికి చెందిన బిస్మిల్లా ఖాన్(35).
లారీ డ్రైవర్ గా వీధులు నిర్వహిస్తాడు. ఈ మేరకు అంసంపల్లి నుంచి ఇందల్వాయి వైపుగా వెళ్తున్న సిమెంట్ లారీ ప్రమాదవశాత్తు లింగాపూర్ వద్ద రోడ్డుకు పక్కన ఉన్న చెట్టుకి ప్రమాదవశాత్తు ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
