HomeTelanganaNizamabadటిఎంఆర్పిఎస్ ఆద్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి..

టిఎంఆర్పిఎస్ ఆద్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి..

టిఎంఆర్పిఎస్ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ.. భూమికోసం ,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల, భూస్వాముల పై తిరగబడ్డ బహుజన ధీరత్వ పతాక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకల ఐలమ్మ అని అన్నారు.

చాకల ఐలమ్మ ఆశల కోసం బహుజన రాజాధికారం కోసం టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ నాయకత్వం ముందుంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గాయ్య మాదిగ టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు దారి హరీష్ మెండోర మండల అధ్యక్షులు పాలెం వంశిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments