HomeLaw and Orderపోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన నివాళ్ళు అర్పించారు.

అనంతరం , పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు.

భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు.

ఈ సందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి , అదనపు డీ.సీ.పీ ( ఎ.ఆర్ ) కె. రామ్ చందర్ రావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments