తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తుక్కుగూడ సభ కు తరలించడానికి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి ఈ ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. తీవ్రమైన ఎండలు ఉండడంతో గ్రామాల నుంచి ప్రజలను ఈ సభ కు తరలించడానికి కాంగ్రెస్ నేతలు వ్యయ ప్రయాసలు పడ్డారు.
కాసేపట్లో హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర సభ జరగనుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. సభ కు లక్షలాది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది అందుకే . 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం.
ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్‌చార్జులు, అసెంబ్లీ ఇంచార్జి లకు జనసమీకరణ బాధ్యతలు ఇవ్వడంతో వారే రవాణా భోజన వసతి కల్పించారు.