జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి (రాష్ట్ర వ్యాప్తంగా) రాజ్యాంగ రక్షణ యాత్ర మన నిజామాబాద్ జిల్లా కు చేరుకుంది ఈ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు డా. పులి జైపాల్, మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి మనం ఈ ఒక్క మనువాదుల రాజ్యాన్ని చూస్తున్నాము… ఎక్కడ చూసినా కుల హత్యలు, మహిళల పై హత్యాచారాలు.. మైనారిటీలపై దాడులు.. మొన్న మణిపూర్ హత్యాకాండ, అదేవిధంగా రాజ్యాంగ సంస్థలను వారి కబందాస్తాలలో పెట్టుకొని వాటి ఉనికిని నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు…ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాజ్యాంగం ఉన్నదా అనిపిస్తుంది? మనువాదుల నుండి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరుతున్నాము అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు అశోక్ భాగ్యవాన్, ఎడ్ల రాము, గంగారాం,సుశీల్ కుమార్, కీర్తి కుమార్ , శ్రీధర్,విజయ్, రాకేష్, నిరంజన్, దేవదాసు మరియు జన విజ్ఞాన వేదిక, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు నర్రా రామారావు, డా.రవీంద్రనాథ్ సూరి, నర్సింహులు,షేక్ హుస్సేన్, జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు…
