లోకసభ ఎన్నికల కోసం జరుగుతున్న తనిఖీ లనుంచి వ్యాపారులకు రైతులకు మినహాయింపు ఇవ్వాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు జగదీష్ రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
వ్యాపారుల, రైతుల లకు సంబంధించి బ్యాంకు .. ఖాతాలు, రశీదులు ఉన్నా బ్యాంకుల బయటే తనిఖీ చేస్తూ డబ్బును సీజ్ చేస్తున్నారు అని, పెట్రోలు బంక్‌లు, రైస్‌మిల్లులు, రైతులు, మాల్స్ తదితరులకు సొమ్మును బ్యాంక్ లో జమ చేయడానికి వెళ్తున్నా పట్టుకొని సీజ్ చేస్తున్నారని దీని వల్ల ఇబ్బంది కలుగుతోంది వారు ఆన్నారు. జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే తదనుగుణంగా అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు .
అధ్యక్షులు జగదీశ్వరరావు ప్రధాన కార్యదర్శి కమల్ ఇనాని కోశాధికారి హితేన్ భీమాని తదితరులున్నారు