కడుపు నొప్పి తో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కోటగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జల్లపల్లి ఫారంకు చెందిన ఐశ్వర్య(11).
తల్లిదండ్రులు వృత్తి రీత్యా కూలీ పనులు చేసుకుంటారు.సోమవారం తండ్రి వృత్తి రీత్యా కూలీ పనులకు వెళ్ళగా ఐశ్వర్య కడుపు నొప్పి భరించలేక ఇంట్లో పడి ఉంది.అది గమనించి తల్లి 108ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు
. ఆసుపత్రి లో చికిత్సా పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి పోలీసులు వెల్లడించారు.