బల్కం పేట ఎల్లమ్మ కల్యాణ ఉత్సవాలకు వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదారాబాద్ మేయర్ విజయలక్ష్మి లు రోడ్డెక్కారు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.
అమ్మవారి కళ్యాణం కు వచ్చిన తమకు అధికారులు ప్రోటోకాల్ మర్యాద ఇవ్వక పోవడం ఫై వారు ఒక్కసారిగా అలకబూనారు. ప్రతియేటా ఆషాడమాసం లో హైదారాబాద్ లో జరిగే బోనాలపండగలో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు.
అయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఆలయానికి వచ్చిన మంత్రికి మేయర్ కు ప్రోటోకాల్ .సమస్య ఎదురైంది వారిని లోపలికి తీసుకెళ్లే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి దీనితో . భక్తుల తోపులాటలో పొన్నం, విజయలక్ష్మిలు కొద్దీ సేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అక్కడి నిర్వహణ అధికారుల తీరుఫై నిప్పులు చెరిగారు అంతటి తో ఆగని మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి ఆలయం బయటే రోడ్డు డివైడర్ మీదే కూర్చొన్నారు .
దీనితో ఒక్కసారిగా అధికారుల్లో అలజడి మొదలయ్యింది. వెంటనే రంగంలోకి దిగి ఒకటికి రెండుసార్లు నచ్చచెప్పడంతో మంత్రి, మేయర్ అలక వీడారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్నారు