నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూరీ జగన్నాథ్ రథ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో ప్రారంభోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని జయప్రదం చేశారు.
ఇందూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 7 వ జగన్నాధ రథయాత్రలో భాగంగా ముఖ్య అతిగా పాల్గొన్న ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ…
ఈ యాత్రలో పాలుపంచుకునే మహత్భాగ్యం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతమని, జగన్నాధుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు వచ్చే సంవత్సరం జగన్నాథ రథయాత్ర లోపు ఇందూరులో కూడా ఇస్కాన్ ఆలయం ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఇందుకుగాను తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు ఇస్కాన్ సిద్ద బలరాం గారు వారితో పాటు ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన ఇస్కాన్ సంస్థ ప్రభువులు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ గారు, బీజేపీ నాయకులు, ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందడ, కృష్ణ, హరీష్, నాయకులు,పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
