ఏటియం లో నగదు ఎత్తుకెళ్లడానికి సాధ్యం కాకపోవడంతో ఏటియం మిషనే ఎత్తుకెళ్లిన ఉదంతం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీదే జరిగింది.
ఈ ఘటనలో దుండుగులు సుమారు నాలుగు లక్షల నగదు ను లూటీ చేశారు.
గుర్తు తెలియని అయిదు గురు సభ్యులున్న ముఠా మంళవారం తెల్లవారు జామున బోలేరే వాహనం లో మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీద ఎస్బిఐ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏటియం వద్ద కాసేపు రెక్కీ చేసి ఆ తరవాత యాక్షన్ లోకి దిగారు.
మొదట సీసీ కెమెరా లకు కంటబడకుండా జాగ్రత్త పడ్డారు. వాటిమీద నల్లటి రంగు ను స్ప్రే చేశారు. అనంతరం కట్టర్ లతోనే ఏటియం మిషన్ లోనుంచి నగదు కాజేయడానికి యత్నించారు.
ఒకటి రెండు వాహనాలు వెళ్లడంతో నేరుగా మిషన్ నే పెకిలించి ఎత్తుకెళ్లారు.బిచ్కుంద శివారు లోని చెరువు కట్టమీద తీరికగా మిషన్ లో నగదు సుమారు నాలుగు లక్షలు తీసుకోని మిషన్ ను అక్కడే వదిలేసి పారిపోయారు.
దొంగలముఠా వాహనం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ఎటు వైపు పారిపోయింది సమీపంలోనే టోల్ గేట్ లలో సీసీ కెమెరా లో ఫుటేజీ ని చూస్తున్నారు.
దోపిడీ కి పాల్పడింది మరాఠా ముఠా గా పోలీసులు అనుమానిస్తున్నారు