కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాలకు పదవుల పందేరంకు తెరలేపింది. మొదటి దఫా గా రాష్ట్రంలో ప్రాధాన్యత ఉన్న 32 కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లను నియమించారు. అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించకపోయినా నిజామాబాద్ జిల్లాకు ఏకంగా నాలుగు ఛైర్మెన్ పదవుల దక్కాయి. మొదట తాహెర్ తో పాటు అన్వేష్ రెడ్డి అనిల్ ఇరవత్రి , మానాల మోహన్ రెడ్డిలకు మొదటి దఫాలోనే కీలక మైన కార్పొరేషన్ లు దక్కాయి.
పదవుల పందేరం లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముద్ర స్పష్టంగా ఉంది. కేవలం ఆయన సిఫారస్ చేసి పట్టుబట్టిన నేతలకే పదవులు వరించాయి. జిల్లాలో సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. పైగా కేవలం బాల్కొండ సెగ్మెంట్ నుంచే ముగ్గురు నేతలకు పదవులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగ పడిన నేతలు ఒక్కో సెగ్మెంట్ లలో కనీసం ఇద్దరు ఉన్నారు.
అర్బన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లలో సీనియర్ నేతలు తమకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పదవులు దక్కుతాయని ఎదురు చూస్తున్నారు. టికెట్ దక్కక పోయిన పార్టీ ప్రయోజనాల నేపథ్యంలో నేతలు సమిష్టగా పనిచేసారు. కానీ పదవుల పందేరం లో ప్రభుత్వ పెద్దలు అనుసరించిన వైఖరి కొందరు సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. పదవులు పొందిన నేతలు పార్టీ విధేయులే.
అయినప్పటికి మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి వర్గీయులుగా బలమైన ముద్ర ఉన్న వారే . కేవలం ఎమ్మెల్యే హోదా లోనే పార్టీ ,పాలనా వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చివరికి పదవుల పందేరంలో నూ పే చేయి సాధించారు.ఇంకా అనేక సీనియర్ నేతలు పదవుల మీద గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. దాదాపు కీలక కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లను ప్రభుత్వం ప్రకటించింది.
ఇక రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి పదవుల్లోనే మిగితా ఆశావహులను సర్దుబాటు చేయాల్సి వుంటుంది.నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లు తమ సెగ్మెంట్ ల నుంచి సీనియర్ నేతల కోసం కనీస ప్రయత్నాలు చేయలేదని టాక్ పార్టీ వర్గాల్లో విసృతంగా ఉంది.