సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణ…నిజామాబాద్ నగరంలో ఆదివారం అర్ధ రాత్రి తాళం వేసిన ఇంట్లో భారీ చోరి ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆరవ టౌన్ ఎస్ఐ మోగిలయ్య తెలిపిన వివరాల ప్రకారం…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటో నగర్ కు చెందిన లతీఫ్ ఆదివారం తన చెల్లిని హైదారాబాద్ ఎయిర్పోర్ట్ లో వదలడానికి వెళ్లారని తెలిపారు.ఈమేరకు సోమవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నట్లు తెలిపారు.
ఇంట్లొకి వెళ్లి చూసేసరికి బీరువా కూడా తెరిచి అందులో నుంచి సుమారు 15తులాల బంగారు,కొంత నగదు అపహరించారనీ పేర్కొన్నారు.బాధితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోగిలయ్య తెలిపారు.దొంగల ముఠా పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.