బోధన్ లో ఇసుక మాఫియా ఆగడాలు ఆగడం లేదు. ఇసుక అక్రమ రవాణా కు అడ్దు తగిలిన పోలీసులమీదే దాడి కి యత్నించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
హోంగార్డు ను టిప్పర్ లో నుంచి తోసేసి పోలీసు పెట్రోలింగ్ వాహనం మీదికే టిప్పర్ ఎక్కించబోయారు. బోధన్ మండలం కొప్పర్గ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దాష్టికానికి తెగబడింది లోకల్ గ్యాంగే నని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. బోధన్ మండలం కొప్పర్గ చిన్న మావంది గ్రామాల మధ్య రాత్రి బోధన్ రూరల్ పోలీసులు ఇన్నో వా వాహనం లో పెట్రోలింగ్ చేస్తున్నారు.
సోమవారం తెల్లవారు జామున ఒంటి గంటకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ గమనించిన పెట్రోలింగ్ పోలీసులు టిప్పర్ ఆపేసి పర్మిట్ అడిగారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో టిప్పర్ ను స్వాదీనం చేసుకున్నారు. హోంగార్డ్ తాజోద్దీన్ టిప్పర్ లో ఎక్కి స్టేషన్ కు తరలిస్తున్నారు.
ఇంతలోనే బైక్ మీద వచ్చిన ఇద్దరు పోలీసు లను గద్దించారు. తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిమంటూ బెదిరించారు హోంగార్డ్ తాజోద్దీన్ ను టిప్పర్ నుంచి తోసేశారు. ఇసుక అక్కడే పడేసి మెరుపు వేగంగా తో టిప్పర్ ను తీసుకెళ్లారు. ఓ దశలో పోలీసు పెట్రోలింగ్ వాహనం అడ్డుగా ఉన్నాసరే దానిమీదికి ఎక్కించ బోయారు.
అందులో హెడ్ కానిస్టేబుల్ రాములు సమయస్ఫూర్తిగా వాహనం పక్కకు తప్పించారు. అయితే ఇసుక మాఫియా కు చెందిన ద్విచక్ర వాహనం ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ లోకల్ బ్యాచ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు