HomeDevotionalఅట్టహాసంగా మొదలైన క్రిస్మస్ సంబరాలు..ఘనంగా బీసీసీ సెమీ క్రిస్మస్ వేడుకలు...భాగ్యనగరిలో క్రిస్మస్ సందడి..

అట్టహాసంగా మొదలైన క్రిస్మస్ సంబరాలు..ఘనంగా బీసీసీ సెమీ క్రిస్మస్ వేడుకలు…భాగ్యనగరిలో క్రిస్మస్ సందడి..

క్రిస్మస్ పండగ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి, ఆయా చర్చి లను అందంగా అలకరించారు. చర్చ్ ల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..

గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు చిన్నా పెద్ద అందరినీ అలరిస్తున్నాయి.హైదరాబాద్ కూకట్ పల్లి లోని భాగ్య నగర్ సెంట్రల్ చర్చ్ లో పది రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు..

బిసిసీ ఫెస్ట్ -2024 పేరుతో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రముఖ దైవజనులు రెవరెండ్ జి.డేవిడ్ ప్రశాంత్ పాల్గొని పండుగ సందేశాన్ని అందించారు .బీసీసీ మినిస్ట్రీస్ అధ్యక్షులు , సీనియర్ సంఘ కాపరి డాక్టర్ విప్పర్తి అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు.

కాగా ఆత్మీయతల్లి శ్రీమతి నిర్మల సామ్ బాబు , జాలీ సామ్ , జిన్నీ సామ్ వేడుకల సమన్వయ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు..”అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో “..”శ్రీ యేసుండు జన్మించే రేయిలో..” ఓ సద్భక్తులారా లోక రక్షకుండు” వంటి సుమధుర భక్తిగీతాలు క్రిస్మస్ వేడుకలకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాయి..

బీసీసీ క్వయర్ బృందం సభ్యులు శ్రీమతి జ్యోతి రావు , పాలీన ఎడిత్ , మేరీ కంభం , షాలిని, మౌనిక , నిఖిత తదితరులు ఆలపించిన “ఆ పాత మధురాలు” భక్తులను అలరించాయి.స్థానిక దైవ జనులు పాస్టర్ నందా , ఇజ్రాయేల్, జాకబ్ రాజు తో పాటు హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ సాల్మన్ రాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

సంఘ పెద్దలు సతీష్ మండ్రు, కంభం శ్యామ్, రత్నమయ్య, జి.సతీష్ తదితరులతో పాటు బీసిసీ మహిళా సమాజం సభ్యులు లక్ష్మి బెనర్జీ , వసుంధర, రత్నకుమారి , రోజారాణి , మంజుల , బిందు, అమ్మాజమ్మ, విజయ ,తబిత తదితరులు పాల్గొన్నారు. చివరిగా ప్రముఖులకు ఆత్మీయ సత్కారంతో పాటు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments