ఇద్దరూ వ్యక్తుల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. నిజాంబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ వన్ పైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ ఘర్షణ లో ఒకరు దుర్మరణం చెందారు.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం. శుక్రవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ ఒకటి పైన నాందేడుకు చెందిన సతీష్ శర్మ(40), మరియు అదే నాందేడ్ రాజు(45)కు మధ్య గొడవ జరిగింది.
ఇద్దరి మధ్య జరిజిన ఘర్షణ లో సతీష్ శర్మ అనే వ్యక్తి రాజు ను నెట్టేయడం వలన ప్లాట్ఫామ్ మీద పడి తలకు తీవ్ర గాయం అవ్వడంతో హటాత్తుగా మృతి చెందినట్లు పోలీస్ లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
సతీష్ శర్మ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లురైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.
