ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఆయన కాసేపట్లో ఆయన నగరానికి రానున్నారు. ఆయన పర్యటన ను సీఎంవో గురువారం పొద్దుపోయాక ఖరారు చేసింది.
దీనితో ఏర్పాట్లు కోసం అధికారులు రాత్రి నుంచే ఉరుకులు పరుగులు పెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశుధ్య సిబ్బంది రాత్రంతా రోడ్లు ఊడ్చారు. ఆర్ అండ్ బి అధికారులు నగరంలో గుంతల మయంగా మారిన రోడ్లను పూడ్చేసారు.
ముఖ్యమంత్రి .హెలి క్యాపిటర్ లో నగరానికి చేరుకొని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంటికి వెళ్లారు ఇటీవలే ఆయన తల్లి మృతి చెందారు. సీఎం అతని పరామర్శిస్తారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలసి భూమారెడ్డి పంక్షన్ హల్ లో దిన కర్మ లో పాల్గొంటారు. ….
/// ..పటిష్టమైన బందోబస్తు///// …….
సీఎం పర్యటన కోసం పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. హైదారాబాద్ లో డీజీపీ రివ్యూ సమావేశం నుంచి రాత్రి హడావుడి గా వచ్చిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,అర్ద రాత్రి నుంచే బందోబస్త్ పనుల్లో పడ్డారు. రాత్రే జిల్లా నలుమూలల నుంచి బలగాలను జిల్లా కేంద్రానికి రప్పించారు. సుమారు ఆరు వందల మంది బందోబస్తు కోసం బలగాలను రంగంలోకి దించారు.
ఉదయం శ్రావ్య గార్డెన్ యందు సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంసీపీ నిర్వహించారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని , సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసిన త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని , ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేయడం జరిగింది.
అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు.ఇట్టి బ్రీఫింగ్ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ , సిసిఎస్ , సి టి సి , ట్రాఫిక్ ఏసీపీ లు రాజా వెంకటరెడ్డి , వెంకట్ రెడ్డి శ్రీనివాస్ నాగేంద్ర చారి , రాజశేఖర్ , మస్తాన్ అలీ మరియు సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు
