Sunday, April 26, 2026
HomeLaw and Orderబాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు...

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు…

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ సాదరంగా స్వాగతం పలికారు.

నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను పలువురు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు.

కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!