వరుస భారీ వర్షాలతో ఓపక్క రాష్ట్రం అతలాకుతలమవుతుంటే ఆర్మూర్ మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
వరద పై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రజలకు కష్టం కలిగిన అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించిన…. వరుస సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షించిన,
గత నిన్న ట్రూవ్ చెయ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించిన… పాలకులు ,ఉన్నతాధికారుల ఆదేశాలు కిందిస్థాయిలో నీరుగారి పోతున్నాయి.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఓ దశలో కొన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
కనీసం మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామిడిపల్లి టెంపుల్ వెనకాల గల హనుమాన్ కాలనీ పూర్తిగా జలదిబ్బందం అయింది.
రైల్వే ట్రాక్ వద్ద చిన్న కల్వర్టు మాత్రమే నీరు వెళ్లడానికి ఉండడంతో, పై భాగం నుండి వస్తున్న వరద నీటితో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
గత రాత్రి నుండి కరెంటు లేక తాగునీరు లేక ప్రజలు విలవిలలాడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు అంటున్నారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో కొన్ని ప్రాంతాలలో పేదల ఇండల్లోకి నీరు వచ్చి చేరింది.
హౌసింగ్ బోర్డు కాలనీ సందర్శన కోసం మొక్కుబడిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు కనీసం కారు దిగకుండానే కలెక్టర్ తో సమావేశం ఉందంటూ వెళ్ళిపోవడం పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురుస్తున్న ప్రతిసారి తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని, బాధితుల గోడు స్థానిక మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడంలేదని, కనీసం జిల్లా కలెక్టర్ అయిన తమ సమస్యపై దృష్టిని సారించి పరిష్కరించాలని ఆర్మూర్ పట్టణవాసులు కోరుతున్నారు.





