నగరాభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు తమతో కలిసి రావాలని అంతేకాని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీద అనవసర ప్రేలాపలు వద్దని షబ్బీర్ జోలికొస్తే ఊరుకోంబోమని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు హెచ్చరించారు.
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా నిజామాబాద్ నగర అభివృద్ధికి షబ్బీర్ అలీ కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తు చేశారు నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలను,
ఇంజినీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ కావడానికి ఆయన మహేష్ సుదర్శన్ రెడ్డి లు కృషి చేసారని వారు గుర్తు చేశారు అదేవిధం గా ఇండోర్ స్టేడియానికి కూడా షబ్బీర్ అలీ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు.
అలాగే బొందెం చెరువు బాధితులకు పునరా వాసం, వారికి ఆర్థిక సాయం కల్పిం చేందుకు తమ ప్రభుత్వం చిత్తశు ద్దితో పని చేస్తోందన్నారు.
గత కొన్ని రోజులుగా క్రితం భారీ వర్షం కారణంగా నాళాలో కొట్టుకు పోయి చనిపోయిన బాలికకు ఆర్థిక సహాయం కింద ప్రభుత్వ సలహాదా రు ప్రభుత్వ పెద్దలతో చర్చించి బాలిక కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా ఇవ్వనున్నామన్నారు
ఈ సమావేశమలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ రామర్తి గోపి తదితరులు పాల్గొన్నారు.
