ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం… రూరల్ మండలంలోని గౌతమ్ గాంబియే (26) కూలీ పనులు చేసుకుంటారు. గత కొన్ని రోజులుగా ఓ యువతిని ప్రేమించాడు. దాంతో యువతి నిరాకరించిందని మస్థాపానికి గురై ఖానాపూర్ శివారులో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపారు.
