ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ అరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని రామ్ నగర్ కు చెందిన ప్రభు గౌడ్(51).
ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై రామ్ నగర్ శివారులోని చెరువులో పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరిఫ్ తెలిపారు.
