HomeCRIMEమరో కాని స్టేబుల్ ఫై వేటు ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్

మరో కాని స్టేబుల్ ఫై వేటు ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్

కమిషనరేట్ పరిధి లో మరో కానిస్టేబుల్ మీద వేటు వేస్తూ కమిషనర్ ఉత్తర్వ్యూలు జారీచేశారు.రుద్రూర్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్న సిద్దిరామ్ చిన్నయ్య రావుల నాగభూషణం అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తాను అని గత కొన్ని నెలల క్రితం 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు .

అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించలేదు. డబ్బులు అతనికి ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు. బాధితుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లో పిర్యాదు చేసాడు నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాలల్లో కూడా ఉద్యోగాల పేర లక్షలకొద్దీ డబ్బులు వసూలు చేసి వారందరినీ మోసానికి గురిచేసినట్లు విచారణ లో తేలింది .

ఈ రకంగా అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతను ఇతరులకు వడ్డీ రూపంలో డబ్బులు ఇచ్చాడు 10 శాతం కన్నా ఎక్కువ వడ్డీని వసూలుచేస్తున్నాడు , విచారణ లో తేలింది దీనితో ఇతని బాధితులందరిని వివరంగా విచారించిన తర్వాత అందరి విజ్ఞాప్తులు కమీషనర్ పి.సాయి చైతన్య, దృష్టికి వెళ్ళింది . క్రమశిక్షణ చర్యలలో భాగంగాకానిస్టేబుల్ ను “నస్పెండ్ చేస్తు ఉత్తర్వులు” జారీచేశారు.

ఇటువంటి చర్యలను సహించేదిలేదని మరియు ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా వుండి మోసపోకూడదని పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments