జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్..రాజీ మార్గమే.. రాజ మార్గమని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 28న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో జిల్లాలోని అని కోర్టు లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,
వివిధ కేసులు, ఇరు వర్గాలు రాజీ ఉంటే లోక్ అదాలత్ ద్వారా కేసులు వెంటనే పరిష్కారం అవుతుందనీ సూచించారు. ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
