ఆర్.బి.వి.ఆర్.ఆర్ హైదరాబాద్ లో 1 సంవత్సరం పాటు ట్రెయినీ ఎస్.ఐల శిక్షణ పూర్తి చేసుకొని బాసర జోన్ 2 పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో బుదవారం రిపోర్టు చేసిన ట్రెయినీ 8మంది ఎస్.ఐలు పోలీస్ కార్యాలయoలో పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ని పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడు మంచి క్రమశిక్షణతో ఉండాలని, తమ పై స్థాయి అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని, ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే త్వరితగతిన స్పందించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిసనల్ డీసీపీ కోటేశ్వర రావు,శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్.ఐలు ఎస్. శ్రీనివాస్, పి. రాజేశ్వర్,కె.కిరణ్ పాల్,కె. శైలెందర్, జడ్.సుస్మిత, ఎమ్.రమ, జె.సుహాసిని, ఎమ్.కళ్యాణి, పాల్గొన్నారు.
