కంచుకోట లాంటి నిజామాబాద్ లోకసభ స్తానం లో ఈసారి విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది.నిజామాబాద్ లోకసభ ఎన్నికల ఇంచార్జి గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నియమించారు. ఆయన్ను ఇదివరకు జహీరాబాద్ లోకసభ ఇంచార్జ్ ఉండే. కానీ నిజామాబాద్ లోకసభ ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉండే కానీ ఆయనే అభ్యర్థిగా ఖరారు చేయడంతో సుదర్శన్ రెడ్డి ని రంగంలోకి దించారు.
నిజామాబాద్ లోకసభ పరిధి ఏడూ అసెంబ్లీ సెగ్మెంట్ లున్నాయి. అందులో జగిత్యాల్ జిల్లా పరిధి లో రెండు జిల్లాలున్నాయి. ఈ రెండు జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరే ఎమ్మెల్యే లున్నారు. అందులో ఒకరు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మొదటి సారి గెలిచారు. అందుకే గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది.
రాష్ట్రం లో దాదాపు అన్ని లోకసభ నియోజకవర్గాలకు మంత్రులను ఇంచార్జ్ గా నియమించారు. కానీ జిల్లా లో మంత్రి లేకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కే గెలుపు బాధ్యతలు అప్పగించారు.ఎలాగో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే ఇంచార్జ్ లుగా ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో అందరితో సమన్వయం చేసే నేర్పు ఓర్పు అనుభవం సుదర్శన్ రెడ్డి కేఉన్నాయని భావించిన పార్టీ ఆయన్ని రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బోధన్ ఎమ్మెల్యే గా గెలిచిన తనకు రేవంత్ క్యాబినెట్ లో బెర్త్ దక్కుతుందని సుదర్శన్ రెడ్డి భావించారు.
అందులోనూ రేవంత్ తో దగ్గరి బంధుత్వం కూడా ఉండడంతో కీలక శాఖ వస్తుందనే భరోసా ఉండే. తనకు హోం ఇవ్వబోతున్నారంటూ సన్నహితులకు చెప్పుకున్నారు. కానీ ఎలాగో జిల్లా నుంచి ఇద్దరే ఎమ్మెల్యే గెలిచారు అందులో భూపతి రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధి లోనూ మరో ఇద్దరు ఎమ్మెల్యే సైతం మొదటి సారి గెలిచినా వారే అందుకే మంత్రి పదవీ ఖాయమనే ధీమాతో ఉండే.
కానీ ఆయన వయస్సు అనుభవం ను దృష్టిలో పెట్టుకొని స్పీకర్ బాధ్యతలు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు భావించారు. కానీ సుదర్శన్ రెడ్డి ససేమిరా అన్నారు.మరో వైపు మంత్రి పదవీ కూడా దక్కలేదు. దీనితో తీవ్ర నిరాశ చెందారు. ఆయన గత కొద్దీ నెలలుగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంటూ కేవలం బోధన్ నియోజకవర్గ వ్యవహారాలకే పరిమితం అయి పనిచేస్తూ వస్తున్నారు. అనేక మార్లు సీఎం రేవంత్ రెడ్డి ని కలుస్తూ అనేక అంశాలు చర్చిస్తూ వస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ ఖాయమనే హామీకూడా వచ్చిందని సమాచారం.
ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన వంద రోజుల పాలనకు రెఫరండంగాభావిస్తున్నారు.ఆరు గ్యారెంటీ ల్లో అయిదు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో లోకసభ ఎన్నికల్లో సులుగా గట్టెక్కాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఎలాగో బిఆర్ యస్ క్షేత్ర స్థాయిలో బలహీనం అయింది. బీజేపీ కి వోటు బ్యాంకు ఇంకా పెంచుకోలేక పోయింది.ఇలాంటి సానుకూల పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవాలనేది కాంగ్రెస్ కార్యాచరణ గా ఉంది. అందుకే దిగ్గజ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి ని రంగంలోకి దించింది.
నిజామాబాద్ లోకసభ స్థానంలో ఎలాగైనా గెలిచే బాధ్యతలు ఆయన కు అప్పగించారు. రాబోయే రోజుల్లో మంత్రి పదవీ ఆశలు సజీవంగా వుండాలంటే సుదర్శన్ రెడ్డి సర్వశక్తుకులు ఒడ్డాల్సి ఉంది. లోకసభ స్థానం చేజారితే మంత్రి పదవీ కి గండి పడే ప్రమాదం కూడా ఆయన కు పొంచి ఉంది. ఈపాటికే ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సైతం మంత్రి పదవీ రేసులో దూసుకొచ్చారు. అందుకే లోకసభ గట్టెక్కడం సుదర్శన్ రెడ్డి కి అనివార్యంగా మారింది.
