రైస్ మిల్ లో పాతసామాను ఎత్తుకెళ్లడానికి పట్టపగలే వచ్చిన దొంగల ముఠా ను గ్రామస్తులు వెంటాడారు. కర్రలు రాళ్లతో దాడి కి తెగబడ్డారు ఈ ఘటనలో ఆరుగురు సభ్యులున్న ముఠా లో ఒకరు మృతి చెందారు. ఈ ముఠా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వారు గా గుర్తించారు. వీరంతా పాత నేరస్తులుగా చెప్తున్నారు. ఆరుగురు సభ్యులు ముఠా ఆటో రిక్షా లో శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ మండలం పాల్డ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారు లో మూత పడ్డ రైస్ మిల్ లోకి చొరబడ్డారు. వీరిని గమనించిన గ్రామస్థులు మూకుమ్మడిగా రైస్ మిల్ కు వెళ్లారు.
అప్పటికే ఆటో లో పాత ఇనుప సామానుసర్దేస్తున్నారు గ్రామస్థుల ను గమనించి దొంగలు ఆటో ను అక్కడే వదిలేసి రైస్ మిల్ వెనుక భాగంలో గోడ దూకి పారిపోయారు. అయినప్పటికీ గ్రామస్థులు వెంటపడ్డారు. రాళ్లు కర్రలతో పరుగులు తీశారు. గ్రామస్థులు దాడి లో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అతన్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిందితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడు సుద్దపల్లి గ్రామానికి చెందిన బానోత్ సునీల్ గా గుర్తించారు. పారి పోయిన మిగితా అయిదుగురికోసం పోలీసులు గాలిస్తున్నారు. నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు



