కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఏడాది లోపు బోధన్ షుగర్ పరిశ్రమ తెరిపించబోతుందని చెరుకు పంట వేయడానికి రైతులు సిద్ధం కావాలని నిజామాబాద్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.ఎంపీ అర్వింద్ ఐదేళ్లు ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేక పోయారని నిలదీశారు.
మోడీ ప్రభుత్వం ఎన్ని ఖాయిలా ఫ్యాక్టరీ లు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ ఎన్ ఎస్ ఎఫ్ ను ఎందుకు పట్టించుకోలేదన్నరు.జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తో గ్రామాల్లో ఎంతో మంది పేదలకు కడుపు నింపిందన్నారు. ఈ పథకం ఆమ్లాలోకి తెచ్చింది కాంగ్ర్రెస్ ప్రభుత్వమన్నారు కానీ మోడీ సర్కార్ ఈ పథకం ను ఎత్తివేసే పనిలో వుందన్నారు.
భారీగా బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి పథకం ను వ్యవసాయం తో అనుసంధానం చేస్తామన్నారు.అంతకు ముందున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనుక ఆలోచించకుండా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది పనికిరాని కాలేశ్వరం ప్రాజెక్టు తెచ్చిపెట్టింది కేవలం కమిషన్ల కోసమే 30 వేల రూపాయల నుండి 40 వేల కోట్ల రూపాయల వరకు వాళ్లు దండుకున్నారు ఈ ప్రాజెక్టు ఎవరికీ ఏ రకంగా పనికిరాకుండా పోయింది
ఈ సమావేశంలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి టీపీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి మధుయాష్కి గౌడ్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి అనిల్ కేశవ వేణు బాడ్సి శేఖర్ గౌడ్, ఆకుల సుజాత ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు
