నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ,వచ్చే నెల 2 నుంచి అందుబాటులోకి రానుంది. సైబర్ నేరాలు బెడద జిల్లాలోనూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్త్రం లో అన్నిజిల్లాలో సైబర్ పోలీసు స్టేషన్ లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ స్టేషన్ డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణాలో పనిచేయబోతుంది.
లక్ష రూపాయలకు పైబడిన సైబర్ నేరాలకు గురైనా కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారు ఎవరైనా పిర్యాదు చేయదలచిన వారు, పోలీస్ కమిషనర్ ఆఫీసులో ని సైబర్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగలరని డిఎస్పీ వెంకటేశ్వర్ రావు కోరారు.
లక్ష రూపాయలకు దిగువన గల సైబర్ క్రైమ్ కేసులు స్థానిక పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేయాలన్నారు సైబర్ క్రైమ్ నకు గురైన వెంటనే 1930 కి కాల్ చేయాలని లేదంటే www.cybercrime.gov.in పోర్టల్ లో పిర్యాదు నమోదు చేయాలని కోరారు ఇతర వివరాల కోసం 8712665554- DSP 8712665587- CI సంప్రదించాలన్నారు