ఆర్మూర్‌పట్టణంలో సోమవారం తెల్లవారు జామున నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది.జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్డిస్ట్రిబ్యూటరీ 82 -2 నెంబర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. . నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ఆ ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయాల్సిఉంది కానీ .ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు.





