ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలు లో ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు లక్ష్యంగా పాత కేసు లను తిరగదోడే పనిలోఉంది సిట్ బృందం. గతంలో సంచలనం రేపిన ఉప్పల్ వై యస్ ఆర్ ఆత్మ హత్య కేసు ను మరోసారి తిరగదోడే పనిలో పడ్డారు. ఆ కేసు ఉచ్చు రాధాకిషన్ రావు మెడకు బిగించే ఆలోచనలో ఉన్నారు.కానీ ఆ కేసు ఫైల్ ఆచూకీ చిక్కడం లేదు.
ఈ కేసులో తనమీద వచ్చిన ఆరోపణలఫై తానే స్వయంగా విచారణ చేసుకొని తనకు తానే క్లిన్ చిట్ ఇచ్చేసి ఆ కేసు అటకెక్కించారు.రాధాకిషన్ రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్నఈ ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఏసీపీ గా పనిచేస్తున్న రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ అలియాస్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది.
2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు.గా ఉన్నాడు.శ్రీధర్ రెడ్డి మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డిని సైతం హత్యచేయడానికి కుట్ర లు చేసాడనేది పోలీసులు అభియోగం దాంతో ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే తాను ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు ఉప్పల్ వైఎస్సార్ ఓ వీడియో సందేశం కూడా వెలుగులోకి వచ్చింది.
దీనితో అప్పటి సైబారాదాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ రాధాకిషన్ రావు మీద కేసు నమోదు చేయించాడు.ఈ కేసులో అరెస్టు చేయడానికి సైతం సిద్ధపడ్డారు. కానీ ఉన్నతాధికారులే ఆయన్ని వారించారు.అయితే ఈ కేసు లో తనమీద నమోదు అయిన అభియోగాల మీద కెసిఆర్ సీఎం అయ్యాక రాధాకిషన్ రావు తనకు తానే విచారణ చేసుకొని క్లిన్ చిట్ ఇచ్చేసుకొని ఆ ఫైల్ చాలాకాలం తనవద్దే పెట్టుకున్నారని అప్పట్లో పోలీసు వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ దందా లో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు తెరాస ప్రభుత్వ పెద్దల అండగా ఇంకా ఎలాంటి అరాచకాలు అక్రమాలు చేసింది అరా తీసే క్రమంలో ఉప్పల్ వై యస్ ఆర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.దీనితో పాటు కొంత మాది హవాలా వ్యాపారులతోనూ విచారణ చేస్తున్నారు