నూతనంగా ఎన్నుకోబడిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రిన్సిపుల్ అండ్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల,గౌరవ అతిథిగా రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ లు హాజరు అయ్యారు మొదటగా అధ్యక్షులుగా ఎన్నికైన జగన్మోహన్ గౌడ్ జనరల్ సెక్రెటరీ వసంత్ రావు జిల్లా జడ్జి చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేయగా అనంతరం కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఎన్నికైన సభ్యులకు ఎన్నికల నియామక పత్రం అందించారు.మరియు ఎలక్షన్ ఆఫీసర్స్ గా బాధ్యతలు నిర్వహించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అముధల సుదర్శన్ మరియు నారాయణదాసు గారికి అభినందన పత్రం అందించారు.
ప్రెసిడెంట్ గా జగన్ మోహన్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ గా p. రాజు,జనరల్ సెక్రటరీ గా s. వసంత రావు,జాయింట్ సెక్రటరీ గా దొంపల్ సురేష్, ట్రెజరర్ గా అందేలా దీపక్,స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రెటరీ గా మొహమ్మద్ అయబ్,లైబ్రరీ సెక్రటరీ గా పిల్లి శ్రీకాంత్,లేడీ రెప్రసెంటివ్ గా A. కవిత రెడ్డి, సీనియర్ E.C మేంబర్స్ గా M. గోవర్ధన్,R.రాజలింగం,G.V కృపాకర్,అజర్ కిషన్ రావు,B.శ్రీనివాస్ చక్రవర్తి,p. నీరజ,శివాజీ బోస్లే,D.రవి కుమార్, విఘ్నేష్, మణీక్ రాజు,వెంకటేష్, లక్ష్మీ నారాయణ,రజిత, విశ్వాక్ సేన్ రాజ్,నారాయణ లు ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం నూతన అధ్యక్షుడు జగన్ మోహన్ మాట్లాడుతూ నిజామాబాద్ బార్ నీ అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేస్తానని నా దృష్టిలో ఉన్న పలుసమస్యలను కమిటీ మరియు సీనియర్,యువ న్యాయవాదుల మద్దతు కూడగట్టే త్వరిత పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల గెలిచిన అభ్యర్థులకు పులా మొక్కను అందించి నూతన మరియు పాత కమిటీలకు శుభాకాంక్షలు తెలిపి వారిని ఉద్దేశించి ప్రసంగించారు నిజామాబాద్ న్యాయవాదుల పక్షాన నిలబడి కమిటీ వారి సమస్యలను పరిష్కరించాలని,న్యాయవాద వృత్తి నిత్య సమస్యలతో కూడుకున్న వృత్తి అని కాబట్టి నూతనంగా ఏర్పడిన కమిటీ ప్రతి న్యాయవాది ధైర్యంగా తమ వృత్తిలో రాణించే విధంగా వారికి సహకరించాలని తెలిపారు,గత కమిటీ యువ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని అందుకు మాజీ ప్రెసిడెంట్ దేవిదా,సెక్రెటరీ భాగిచరణ్ ని ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా నూతన కమిటీ కూడా కొత్త మార్గాలను ఎంచుకొని న్యాయవాదుల సంక్షేమానికి పెద్ద పీట వెయ్యలను కోరారు అదేవిధంగా బార్ అండ్ బెంచ్ రిలేషన్ కాపాడాలని కోరారు.కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది.



