ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం.. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.
ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే,అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావో యిస్టులు తారస పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందు పాతరలు,ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
