HomeTelanganaNizamabadకరువు సహాయచర్యలు చేపట్టండి .....వరి కి బోనస్ ఇవ్వండి .........కలెక్టర్ ను కోరిన బిఆర్ యస్...

కరువు సహాయచర్యలు చేపట్టండి …..వరి కి బోనస్ ఇవ్వండి ………కలెక్టర్ ను కోరిన బిఆర్ యస్ నేతలు

యంత్రాంగం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం అంచనాలు వేయాలని ,పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు ఇవ్వాలని బిఆర్ యస్ నేతలు డిమాండ్ చేసారు. ఈ మేరకు లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ లు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నదన్నారు .వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను పంపాలన్నారు యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం .

వరి తో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిందని ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపు ను అమలు చేస్తామని చేయలేదు .యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు మా రెండు డిమాండ్లయిన పంట నష్టం వివరాల సేకరణ ,బోనస్ చెల్లింపు ల పై సానుకూలంగా స్పదించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments