Thursday, January 15, 2026
HomeTelanganaNizamabadబోధన్ మెట్ పల్లీ షుగర్ ఫ్యాక్టరీలను .2025 చివరి నాటికి తెరిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ...

బోధన్ మెట్ పల్లీ షుగర్ ఫ్యాక్టరీలను .2025 చివరి నాటికి తెరిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు

బోధన్ మెట్ పల్లీ షుగర్ ఫ్యాక్టరీలను .2025 చివరి నాటికి తెరిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన మంగళవారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ ని ఏర్పాటై అయ్యిందని కమిటీ పని కూడా మొదలు పెట్టిందన్నారు .

2001 లో చంద్రబాబు షుగర్ ఫ్యాక్టారిను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే,2015 ఎంపీ కవిత వున్న చక్కెర ఫ్యాక్టరీలు ముసేయించిందన్నారు ఎంపీ .అరవింద్ పసుపు బోర్డుకు బాండ్ పేపర్ రాసి మోసం చేశాడు.నరేంద్ర మోడీ పసుపు బోర్డుకు జీవో ఇచ్చి అరు నెలలు గడుస్తున్నా ఇప్పడు వరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో విది విధానాలు తెలియజేయలేదని మండిపడ్డారు పసుపుకూ ధర లేక పసుపు సాగు విస్తీర్ణం తగ్గిందని, కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ఇవ్వడంలో విఫలంఅయిందన్నారు బిజెపి ప్రభుత్వం.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టింది ఎన్డీయే ప్రభుత్వం.నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామనిమోసం చేశారన్నారు .పెద్ద నొట్ల రద్దుతో అవినీతి నిర్మూలించాలేదు.పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వైట్ మనిగా మార్చుకునే అవకాశం కల్పించిందన్నారు రైతులను దేశ రాజదానిలో రోడ్డున పడేసింది.

మద్దతు ధర కల్పించడం ప్రభుత్వం బాధ్యత దానికి చట్టబద్దత కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత.రైతులకు రుణాలు మాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని అంటున్నమోడీ బడ వ్యాపారులకు రుణాలను ఎగ్గెట్టిన ఏమి అనలేక పోయిందన్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని,ప్రస్తుతంవ్యవసాయ కూలీలకు పని విధంగా , ఉపాధి హామీ ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుంది ఆయన అన్నారు.

అదేవిధంగా కేంద్రం లో అధికారంలోకి రాగానే దేశం మొత్తం రైతు రుణాలు మాఫీ చేసేవిందంగ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు ఈ సమావేశం లో పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,నగేష్ రెడ్డి, NSUI అధ్యక్షులు వేణు రాజ్,రత్నాకర్, అంతిరెడ్డీ రాజారెడ్డి, అవెజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!