నవీపేట్ సమీపం లో అబ్బాపూర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్విఫ్ట్ కార్ అదుపు తప్పి రోడ్ ప్రక్కన వున్నా చెట్టుకి ఢీకొట్టాడంతో ఈ ప్రమాదం జరిగింది . ధర్మాబాద్ నుండి నిజామాబాదు వస్తున్న స్విఫ్ట్ కార్ అదుపు తప్పి రోడు ప్రక్కన వున్నా చెట్టు కి ఢీకొంది.
కారు లో ఉన్న సులోచానా అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందగా మిగితా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో నగరం లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.వీరంత నగరంలోని కోట గల్లీ కి చెందినవారు.
