HomeTelanganaNizamabadప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ .....వారం రోజుల పాటు పాదయాత్ర శ్రమదానం ....రంగంలోకి మీనాక్షి

ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ …..వారం రోజుల పాటు పాదయాత్ర శ్రమదానం ….రంగంలోకి మీనాక్షి

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగేలా పీసీసీ కార్యాచరణ రూపొందిస్తుంది.

శ్రమదానం పాదయాత్ర లతో పాటు విధిగా కార్యకర్తల భేటీలు జరిగేలా పీసీసీ పక్క ప్రణాళిక ఖరారు చేసింది. ఆరు జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు వుండేలా ప్లాన్ సిద్ధం చేసారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో కలిసి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగబోతుంది. ఈ నెల 31 న రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొదలు పెట్టి ఆగస్ట్ 6 న వరంగల్ జిల్లా వర్దన్నపేట్ లో చివరి మీటింగ్ జరగనుంది.

ఒక్కో నియోజకవర్గంలో సాయంత్రం పాదయాత్ర రోజంతా శ్రమదానఁ మధ్యాహ్నం వేల పార్టీ క్యాడర్ తో భేటీలు జరగబోతున్నాయి.

ఈ నెల 31 న పరిగి లో సాయంత్రం పాదయాత్ర చేసి అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం శ్రమదానఁ మధ్యాహ్నం పార్టీ సమావేశం సాయంత్రం మళ్ళీ పాదయాత్ర ను నిర్వహించనున్నారు.

మరుసటి రోజు మెదక్ జిల్లాలో అందోల్ లో ఆగస్టు 3 న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆగస్టు 4 న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ఐదున కరీంనగర్ చొప్పదండి లో అయిదు న ఆరు న వరంగల్ జిల్లా వర్దన్నపేట్ లో లో ముగింపు కానుంది.

ప్రజల్లో ప్రభుత్వ పనితీరు ను అంచనా వేయడానికే ఈ కార్యం తలపెట్టారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments