HomeTelanganaNizamabadఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్‌ గర్జన..బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ..సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను భర్తరఫ్‌ చేయాలని...

ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్‌ గర్జన..బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ..సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌..దిష్టిబొమ్మ దహనం..

ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ కాంగ్రెస్‌ రోడ్డెక్కింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఆయనను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిజామాబాద్‌లో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.

టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు నాగేశ్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి గాంధీచౌక్‌ వరకు ర్యాలీ చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి ఓట్లను గల్లంతు చేయడంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన పౌరుల ఓట్లు తొలగిస్తే వారు ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గియానేశ్‌ కుమార్‌ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

“బీజేపీకి తొత్తుగా మారిన ఎన్నికల కమిషనర్‌ మాకొద్దు.. జ్ఞానేశ్వర్ కుమార్‌ రాజీనామా చేయాలి.. భర్తరఫ్‌ చేయాలి” అంటూ నినాదాలు చేశారు. ఓట్ల గల్లంతుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడానికి ప్రాతిపదిక ఏమిటో స్పష్టం చేయాలని, అర్హులైన ఓటర్ల పేర్లను ఎలాంటి కారణాలతో తొలగించారో వెల్లడించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని అన్నారు.

గాంధీచౌక్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు నిరసన కొనసాగించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఈసీని భర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌ను బలంగా వినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments