కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిపించాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ జూబ్లీహిల్స్ విజయం రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసి విజయానికి నాంది అని ఆయన అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదారాబాద్ లోని ముసి సుందరీకరణ, ఐటీ అభివృద్ధి,రోడ్ల నిర్మాణాలు చేపట్టిన అభివృద్ధికి ప్రజలు వారి ఓటు ద్వారా సమాధానం చెప్పారని తెలిపారు.
ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని దానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే తీర్పు చెప్పారని తెలిపారు.అలాగే మిగిలిన మూడేళ్లలో రాష్ట్రంలో ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తామని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 కు పైగా సీట్లు గెలిపించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇదివరకే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పు చెప్పారని గుర్తు చేశారు.
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి భవిష్యత్తు తీర్పు చెప్పారని ఎద్దేవ చేశారు.ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్తు లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణంగా కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.అనేక కారణాల వల్ల బీహార్ లో కాంగ్రెస్ వెనకంజలో ఉందని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ది ప్రజా విజయం అని కొనియాడారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు
ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
