HomeCRIMEఎస్సీ ఎస్టీ కేసులో కానిస్టేబుల్ తో పాటు ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష…

ఎస్సీ ఎస్టీ కేసులో కానిస్టేబుల్ తో పాటు ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష…

ఓ మహిళా మీద దాడి చేసి కులం పేరుతొ దూషించిన కేసులోకానిస్టేబుల్ తో పాటు తండ్రి, సోదరుడికి జిల్లా రెండవ సెషన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.


కోటగిరి చావిడిగల్లికి సంబంధించిన గైనీ రామవ్వ తన స్థలంలో పశువలకోసం టిన్ రేకులతో షెడ్డు నిర్మించగా.2003 మర్చి 28 న అదే గల్లీకి చెందిన బర్ల ప్రవీణ్ అనే వ్యక్తి అందాజా ఉదయం ఎనిమిది గంటల సమయంలో షడ్డును తొలగించాలని ఇక్కడ ఎందుకు షెడ్డు వేస్తున్నామని స్థలం విషయంలో గొడవపడి జరిగినట్లు తెలిపారు.

దీంతో వెళ్ళిపోయి తిరిగి రాత్రి 8:30 సమయంలో తమ్ముడు బర్ల నవీన్,తండ్రి బర్ల భూమయ్యతో అక్కడికి వచ్చి రామవ్వను కులం పేరుతో దూషిస్తూ ఆమెపై దాడి చేస్తూ షెడ్డును తొలగించే ప్రయత్నం చేశారు.

తదనంతరం గ్రామ పెద్దలతో విషయాన్ని చెప్పగా మాట్లాడతామని చెప్పి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో 05.04.2021 నాడు రామవ్వ కోటగిరి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా పోలీసు వారు కేసు ఫైల్ చేసి కేస్ విచారణ అనంతరం సోమవారం ముద్దాయిలు బర్ల ప్రవీణ్,బర్ల నవీన్,బర్ల భూమయ్య ను దోషులుగా తెరిచిన న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments