HomeCRIMEటాస్క్ ఫోర్స్ పునరుద్ధరణ ఎప్పుడో ..?

టాస్క్ ఫోర్స్ పునరుద్ధరణ ఎప్పుడో ..?

అసాంఘిక కార్యకలాపాలు,.కట్టడిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ ఇప్పట్లో పునరుద్దరించేలా లేరు.

కమిషనర్ మరోసారి టాస్క్ ఫోర్స్ వ్యవస్థ అను అందుబాటు లోకితెస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

కమిషనరేట్ ఏర్పాటు అయ్యాక అందుబాటులోకి వచ్చిన టాస్క్ ఫోర్స్ ను పదేళ్ల తర్వాత అందుబాటులో లేకుండా పోయింది.

కమిషనర్ ల స్వీయ పర్యవేక్షణలో ఉండే ఈ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడం వల్లే కమిషనర్ సాయి చైతన్య సమూల ప్రక్షళన కు సిద్ధం అయ్యారు.

ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ని పోస్టింగ్ లు పొందిన చోటికి పంపేశారు. తీవ్రమైన ఆరోపణలు వివాదాలకు తోడు పనితీరు కూడా గొప్పగా లేకపోవడంతోనే ఆయన వేటు వేశారు. మొదట్లో పునర్వ్యవస్తీకరిస్తారని భావించారు.

కానీ ఆ దిశగా ఎలాంటి కసరత్తులు జరగక పోవడంతో ఈ విభాగం ఇక ఉనికి లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ సాగుతుంది.

టాస్క్ ఫోర్స్ తరహా లోనే సీసీఎస్ ను అందుబాటులోకి వస్తుంది.కేవలం ఆర్థిక నేరాల నియంత్రణ కోసం పనిచేసే సీసీఎస్ లోనూ నైపుణ్యం ఉన్న వారే ఉన్నారు.

ఏసీపీ ఇద్దరు సీఐ లు ఎస్సై లతో పుష్కలమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఎలాగో జిల్లాలో దొంగతనాలు దోపిడీ లు లాంటి ఆర్థిక నేరాలు బాగా తగ్గిపోయాయి దీనితో సీసీఎస్ కు పని భారం లేకుండా పోయింది.

పైగా టాస్క్ ఫోర్స్ లో ఆయా నేరాల నియంత్రణ తగ్గి వసూళ్ల దందా పెరగడం తో పోలీస్ శాఖ ప్రతిష్టే మసక బడుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆ విభాగంలోని 14 మందిని బదిలీ చేశారు.

తక్షణ చర్యల్లో భాగంగా ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 9 మంది కానిస్టేబుళ్లను తొలగించి ఇతర ప్రాంతాలకు బదిలీ వేటు వేశారు.

అసాంఘిక కార్యకలాపాలు, కట్టడిలో కీలకంగా ఉండే టాస్క్ ఫోర్స్ లో బదిలీలు చేసి వారం గడవడంతో పునరుద్ధరణ కొత్తవారితో పునరుద్ధరణ ఎప్పుడూ చేస్తారని ఎదురుచూస్తున్నారు.

ఇందుకోసం ఎలాంటి రిమార్కు లేని వారికోసం టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించబోతున్నారని మొదట్లో ప్రచారం జరిగింది

టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో ఏసిపి లేకపోవడంతో కుప్పకూలే దుస్థితి..

ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ టాస్క్ ఫోర్స్ లో మార్పు కానరావడం లేదు. సీపీ కల్మేశ్వర్‌ ‌ ఉన్నప్పుడు ఈ విభాగం తీవ్రమైన ఆరోపణలకు గురైంది.

నాటి ఏసీపీ ఇష్టారీతిన వ్యవహరించడం పోలీస్‌ అధికారులకు తలనొప్పి తెప్పించింది . దీంత సీపీ కల్మేశ్వర్ నేరుగా డీజీపీకి టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీపై నివేదికను సమర్పించారు. దీంతో ఏసిపి నీ మొదట బదిలీ, ఆ తర్వాత సస్పెన్షన్‌ వేటు వేశారు.

దీంతో నిజామాబాద్‌ కమిషనరేట్‌లోనీ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఏసీపీ లేక 10 నెలలు అవుతుంది. అయినా ఇన్‌ఛార్జీ అధికారితోనే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు.

ఇన్‌ఛార్జీ అధికారి అటు సీసీఎస్ లో ఉంటూ ఇటు టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో పని చేయలేక సమస్య కుప్పకూలే దుస్థితి వచ్చిందనీ ఆరోపణలు వెలుగుతున్నాయి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments