నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీని రాజస్థాన్కు చెందిన కంటెయినర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి టేక్రియాల్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఢీకొట్టింది
.ఈ ఘటన దేవనపల్లి పిఎస్ పరిధిలోని చోటు చేసుకుంది. టేక్రియాల్ గ్రామ శివారులో గల ఎన్ హెచ్ 44 పై పోలీసులు వచ్చి జేసీబీ సహాయంతో లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనలో కంటెయినర్ వాహనం క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా అందులో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
